Mosquito repellant plants: ఇంట్లో ఆ మొక్కలు పెంచుకుంటే..దోమలు, క్రిమ కీటకాలు దూరం

Mosquito repellant plants: వర్షాకాలం సమీపిస్తోంది. ఇంట్లో కొన్ని రకాల చిన్న చిన్న మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమల బాధను అరికట్టవచ్చు. ఆ మొక్కలేంటో పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2022, 12:13 PM IST
Mosquito repellant plants: ఇంట్లో ఆ మొక్కలు పెంచుకుంటే..దోమలు, క్రిమ కీటకాలు దూరం

Mosquito repellant plants: వర్షాకాలం సమీపిస్తోంది. ఇంట్లో కొన్ని రకాల చిన్న చిన్న మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమల బాధను అరికట్టవచ్చు. ఆ మొక్కలేంటో పరిశీలిద్దాం..

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది త్వరగా రానున్నాయి. అదే సమయంలోదోమల బెడద ఎక్కువ కానుంది. దోమల్నించి రక్షించుకునేందుకు వివిధ రకాల మస్కిటో కాయిల్స్, రెపెల్లెంట్స్, స్ప్రేలు వినియోగిస్తుంటారు. కానీ మొక్కల పెంపకం వంటి కొన్ని సహజ పద్ధతుల ద్వారా దోమల్నించి సంరక్షించుకోవచ్చు. కొన్ని రకాల ప్రత్యేకమైన మొక్కలు ఇంటికి అందాన్నివ్వడమే కాకుండా దోమల్నించి పరిరక్షిస్తాయి.

రోజ్‌మేరీ

ఇంట్లో దోమల్ని తరిమికొట్టే అద్భుతమైన మొక్కల్లో ఒకటి రోజ్‌మేరీ. వనమూలిక కావడంతో దోమల్నించే కాకుండా ఇతర కీటకాల్ని కూడా రక్షిస్తుంది. చిన్న చిన్న కుండీల్లో ఇండోర్ ప్లాంట్స్‌గా పెంచుకోవచ్చు.

మేరీగోల్డ్స్

ఇది దేశంలో సాధారణంగా కన్పించే మొక్క. సాధారణమైన మట్టిలో సులభంగా పెరిగే మొక్క ఇది. కలల్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా సువాసన వెదజల్లుతుంది. దోమలు, క్రిమి కీటకాల్న అరికడుతుంది. ఇవి కూడా చిన్న చిన్న కుండీల్లో ఇంటి గుమ్మాలు లేదా కిటీకీల్లో పెట్టి పెంచుకోవచ్చు.

తులసి

తులసి మొక్క ప్రతి ఇంట్లో సాధారణంగా కన్పించేదే. హిందూవులకు పవిత్రమైన మొక్క కూడా. మస్కిటో లార్వాను చంపడంలో దోహదపడుతుంది. తులసి మొక్క ఘాటైన వాసన క్రిమికీటకాలి దూరం చేస్తుంది. 

లెమన్ గ్రాస్

ఇది కూడా మస్కిటో రెపెల్లెంట్‌గా ఉపయోగపడుతుంది. వైవిద్యమైన వాసన కలిగిన లెమన్ గ్రాస్ మొక్కల్ని ఇంట్లో కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు.

మింట్ లేదా పుదీనా

ఇది తెలియనివారెవరూ ఉండరు. అన్ని ఇళ్లలో ఉంటుంది. పుదీనా మొక్కలతో ఇంట్లో దోమలు, క్రిమి కీటకాలు రాకుండా చేయవచ్చు. ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు.

గార్లిక్

ఇది అద్భుతమైన సహజసిద్ధమైన మస్కిటో రెపెల్లెంట్ . దోమలతో పాటు ఎగిరే అన్ని కీటకాల్ని దూరం చేస్తుంది. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో వివిధ ప్రాంతాల్లో పెట్టడం ద్వారా దోమల్ని అరికట్టే పద్ధతి అనాదిగా ఉంది. ఇక మొక్కల్ని పెంచుకుంటే ఇంకా మంచిది. 

సిట్రోనెల్లా గ్రాస్

లెమన్ గ్రాస్‌లా కన్పించే మొక్క ఇది. సిట్రస్ వంటి సెంట్‌ను వెదజల్లుతుంది. ఫలితంగా దోమల్నించి పూర్తిగా సంరక్షిస్తుంటుంది. సిట్రోనెల్లా గ్రాస్ అనేది అన్ని మస్కిటో రెపెల్లెంట్స్‌లో కచ్చితంగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు.

Also read: Male Fertility: పురుషుల్లో సంతానోత్పత్తి పెరిగేందుకు ఈ నట్స్ తినండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News