మలాశయంలో కేజీ బంగారం.. దొరికిన కిలాడీ

మలాశయంలో కేజీ బంగారం.. దొరికిన కిలాడీ

Updated: Sep 13, 2018, 04:46 PM IST
మలాశయంలో కేజీ బంగారం.. దొరికిన కిలాడీ

న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయంలో ఒక కిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని  కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసినట్లు బుధవారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

24 ఏళ్ల ప్రయాణికుడు దుబాయి నుంచి న్యూఢిల్లీకి రాగా.. అనుమానం వచ్చి విమానాశ్రయ సిబ్బంది అతని లగేజీని పరిశీలించారు. తర్వాత అతన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించగా.. పురీషనాళంలో (మలాశయం) 1.04 కేజీల బరువున్న 9 బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. రూ.32 లక్షల విలువైన ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

మరో కేసులో బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నారంటూ ఓ భారతీయుడితో పాటు మరో ఫ్రెంచ్ దేశస్థుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరూ రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చారు. భారతీయుడు చెన్నై నుంచి రాగా, ఫ్రెంచ్ దేశస్థుడు సింగపూర్ నుండి సోమవారం బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరి నుంచి సుమారు కేజిన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.