పూణేలో డైరెక్టర్ భార్య అనుమానాస్పద మృతి

పూణేలో దర్శకుడి భార్య సొంత ప్లాట్ లో చనిపోయింది.

Updated: Feb 10, 2018, 04:37 PM IST
పూణేలో డైరెక్టర్ భార్య అనుమానాస్పద మృతి

ప్రముఖ మరాఠీ థియేటర్ యజమాని, దర్శకుడు దిలీప్ కొఠారి భార్య దీపాలి కొఠారి (65) పూణెలోని తన సొంత ఫ్లాట్‌‌లో మరణించారు. గురువారం దీపాలి కొఠారి ప్రమాదవశాత్తూ మరణించినట్లు ఆమె అల్లుడు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం అర్థరాత్రి సమయంలో ఆమె మరణించినట్లు పోస్ట్-మార్టం నివేదిక వెల్లడించింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపాక తలపై తప్ప మిగితా అన్ని చోట్ల కూడా కాలిన గాయాలు ఉన్నాయని.. ఆమెను ఎవరో క్రూరంగా కొట్టారని, హింసించారని డాక్టర్లు నివేదికలో తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు ప్రస్తుతం దీపాలి మరణానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కుటుంబానికి శత్రులెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఆలోచించి దర్యాప్తు చేస్తున్నామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.