రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న అధికార, ప్రతిపక్షాలు

                                

Last Updated : Jul 18, 2018, 08:23 AM IST
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న అధికార, ప్రతిపక్షాలు

బుధవారం (జూలై 18) నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు అస్త్రశస్త్రలు సిద్ధం చేసుకున్నాయి. ట్రిపుల్ తలాక్, ఓ బీసీ సహా పలు కీలక బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. కాగా రైతు సమస్యలపై మోడీ సర్కార్ ను నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమౌతున్నాయి. రైతు ఆత్మహత్యలపై కేంద్రాన్ని ఉతికి ఆరేయాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నాయి. కాగా తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశముంది. 

టీడీపీ అవిశ్వాస తీర్మానం
విభజన హామీలు అమలు చేయడంతో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తున్న టీడీపీ.. మోడీ సర్కార్ పై అవిశ్వాస నోటీసు ఇచ్చింది. కాగా చర్చకు వస్తే మోడీ సర్కార్ ను ఉత్తికి ఆరేయాలని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇదే అంశంపై మోడీ సర్కార్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అయితే టీడీపీ అవిశ్వాసం ప్రవేశపెట్టినందున ఆ పార్టీకి సపోర్టు చేయాలా.. లేదంటే సొంతగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలా అనే అంశంపై కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనప్పటికీ విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసేందుకు పార్లమెంట్ సమావేశాలను చక్కగా వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది.

విభజన హామీలపై టీఆర్ఎస్ గురి
మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్రాన్ని గట్టిగ నిలదీయాలని వ్యహాన్ని సిద్ధం చేసుకుంది. ప్రధానంగా విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు నెలవేర్చాలని కోరనుంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన దానిపై పట్టుబట్టేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై టీఆర్ఎస్ స్టాండ్ ఎలాంటి ఉంటుందనే అంశంపై ఉత్కంఠట నెలకొంది. ఈ అంశం టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అవిశ్వాసానికి మద్దతు  ఇవ్వాలా వద్దా అనేది కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. 

Trending News