ఆస్తి కోసం కన్నతల్లినే గెంటేసిన క్రూరుడు.. నవజ్యోత్ సిద్ధూపై సోదరి సంచలన ఆరోపణలు

Navjoth Singh Sidhu sister allegations against him: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సిద్ధూపై ఆయన సోదరి చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంజయ్ ఆస్తి కోసం తనను, తన తల్లిని గెంటేశాడని ఆమె ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 09:27 PM IST
  • నవజోత్ సింగ్ సిద్ధూపై సోదరి సంచలన ఆరోపణలు
  • చంఢీగఢ్‌లో ప్రెస్ మీట్ పెట్టిన సోదరి
  • ఆస్తి కోసం తల్లినే గెంటేశాడని ఆరోపణలు
ఆస్తి కోసం కన్నతల్లినే గెంటేసిన క్రూరుడు.. నవజ్యోత్ సిద్ధూపై సోదరి సంచలన ఆరోపణలు

Navjoth Singh Sidhu sister allegations against him: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సుమన్ తుర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ డబ్బు కోసం, ఆస్తి కోసం కన్నతల్లినే వదిలేసిన క్రూరుడని విమర్శించారు. 1986లో తమ తండ్రి మరణం తర్వాత సిద్ధూ తనను, తల్లిని ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించారు. శుక్రవారం (జనవరి 28) చంఢీగఢ్‌లో (Chandigarh) ప్రెస్‌మీట్ పెట్టిన సుమన్ తుర్ సిద్ధూపై ఈ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. పంజాబ్ ఎన్నికల ముంగిట్లో సిద్ధూ సోదరి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

'నేను, నా తల్లి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. నా తల్లి నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది.. చివరకు ఒక రైల్వే స్టేషన్‌లో దిక్కులేని దానిలా చనిపోయింది. మా తండ్రి ఒక ఇంటిని, కొంత భూమిని మాకిచ్చారు. సిద్ధూ డబ్బు కోసమే వృద్ధురాలైన తల్లిని వదిలేశాడు. నిజానికి మాకేమీ ఆ డబ్బు అక్కర్లేదు. నేను చేస్తున్న ఆరోపణలన్నింటికీ నా వద్ద ఆధారాలున్నాయి.' అని తుర్ పేర్కొన్నారు.

అంతేకాదు, చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడిపోయారంటూ సిద్ధూ 1987లో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబద్దం చెప్పాడని సుమన్ తుర్ ఆరోపించారు. తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధూ (Navjoth Singh Sidhu) చెబుతున్నదంతా అవాస్తవమేనని అన్నారు. సిద్ధూ వ్యాఖ్యలపై అప్పట్లో తన తల్లి కోర్టును కూడా ఆశ్రయించిందన్నారు. ఈ ఏడాది జనవరి 20న తాను సిద్ధూను కలిసేందుకు అతని ఇంటికి వెళ్లగా... కనీసం గేటు కూడా తెరవలేదన్నారు.

సిద్ధూని కలిసేందుకు తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం వల్లే ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందన్నారు. తన ఫోన్ నంబర్‌ను కూడా సిద్ధూ బ్లాక్ చేసినట్లు ఆరోపించారు. తన తల్లికి సిద్ధూ (Navjoth Singh Sidhu) న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల వయసులో తాను ఈ విషయాలన్నీ బయటకు వెల్లడించడం కఠినంగా ఉందన్నారు. కాగా, సుమన్ తుర్ సిద్ధూ తండ్రి మొదటి భార్య కూతురు. ఎన్నారై అయిన ఆమె కొద్దిరోజుల క్రితమే ఇండియా వచ్చినట్లు సమాచారం.

Also Read: Crime inspired by Drishyam: 'దృశ్యం' స్టైల్లో క్రైమ్‌కి స్కెచ్, అడ్డంగా దొరికిపోయారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News