కాంగ్రెస్‌ చేసిన ఆ ట్వీట్ పై ఎగతాళి చేస్తూ కామెంట్లు

టీమిండియాకు  కంగ్రాట్స్ చెబుతూ కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఆ ఒక్క ట్వీట్ పార్టీ పరువుపోయినంత పనైంది. ఇంతకీ ట్వీట్ లో ఏముందో తెలుసుకోవాలని ఉందా.. అయితే వివరాల్లోకి వెళ్లండి...

Last Updated : Oct 16, 2018, 11:17 AM IST
కాంగ్రెస్‌ చేసిన ఆ ట్వీట్ పై ఎగతాళి చేస్తూ కామెంట్లు

టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న టీమిండియాకు  కంగ్రాట్స్ చెబుతూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘వెస్టిండీస్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న మెన్ ఇన్ బ్లూకు అభినందనలు’’ అని  తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ ట్వీట్ లో టీమిండియా టెస్టు జట్టును ‘మెన్ ఇన్ బ్లూ’గా పేర్కొనడం చూసిన నెటిజన్లు చెలరేగిపోయారు. కాంగ్రెస్‌ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.  

వాస్తవానికి బ్లూ జెర్సీలనే ధరించి బరిలోకి దిగే టీమిండియా వన్డే జట్టును మాత్రమే ‘మెన్ ఇన్ బ్లూ’ గా పిలుస్తారు. టీమిండియా టెస్టు జట్టు అందరి లాగే వైట్ జెర్సీలనే ధరిస్తున్న విషయం అందికీ తెలిసిందే. ఈ చిన్న తేడాను మరిచి పొరపాటున ‘మెన్ ఇన్ బ్లూ’గా పేర్కొంటూ కామెంట్ చేసినందుకు అపహాస్యం పాలయ్యింది. ‘మెన్ ఇన్ బ్లూ’గా పేర్కొన్న కాంగ్రెస్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

 

విండీస్‌తో జరిగిన రెండు టెస్టులను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ స్వదేశంలో వరుసగా పది టెస్టు సిరీస్‌లను గెలుచుకుని రికార్డులకెక్కింది. అరుదైన ఘనత సాధించిన కోహ్లీ సేనపై అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు. భారత్ విజయంపై స్పందించిన కాంగ్రెస్ కూడా జట్టును ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. సరిగ్గా ఇప్పుడా ట్వీటే ట్రోలింగ్‌కు కారణమైంది.

Trending News