కూతురు ఈశాతో కలిసి డాన్స్ వేసిన నీతా అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఈశాకి అజయ్ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌కు నిశ్చితార్థం జరిగింది.

Updated: May 13, 2018, 01:18 PM IST
కూతురు ఈశాతో కలిసి డాన్స్ వేసిన నీతా అంబానీ

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఈశాకి అజయ్ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌కు నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ సోమవారం నివాసంలో రాత్రి ఎంగేజ్‌మెంట్‌ పార్టీని నిర్వహించారు. ఘనంగా విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, క్రికెట్‌ ప్రముఖులు హాజరయ్యారు. సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు షారూక్‌ ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు హాజరయ్యారు.

అటు సోషల్ మీడియాలో కూడా అంబానీ నిశ్చితార్థపు ఫోటోలు, వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈశా తల్లి నీతా అంబానీ కూడా సందడిలో మునిగితేలారు. కత్రినా కైఫ్ నటించిన 'బార్ బార్ దేఖో' సినిమాలో 'నచ్ నే సారే' పాటకు కుమార్తె ఈశాతో కలిసి మమ్మీ నీతా అంబనీ డ్యాన్స్ చేశారు. ఆతరువాత సోలో డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేశారు. శ్రీదేవీ నటించిన 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రంలో 'నవ్రాయ్ మజ్హి' పాటకూ స్టెప్పులేశారు. ఈ వీడియోలు మీరూ చూడండి.

 

 

Clip - I :: Smt #NitaAmbani performs on #NavraiMajhi | #IshaAmbani Engadgement

A post shared by Nita Ambani (@nitamambani) on

కొన్ని రోజుల కిందటే ఈశా కవల సోదరుడు, ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ కు,  ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా కుమార్తె శ్లోకతో ఆకాశ్ నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..! వీరి వివాహం కూడా డిసెంబరులోనే జరగనుంది. ఈశా, ఆనంద్‌ల వివాహం కూడా డిసెంబరులో చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close