30 రోజుల్లో జాబ్ రాకపోతే.. 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా

ఓ ఈపీఎఫ్ సభ్యుడికి 30 రోజుల పాటు ఉద్యోగం లేకపోతే తన పీఎఫ్ సొమ్ములో నుంచి 75 శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. రెండు నెలల పాటు ఉద్యోగం లేకుంటే ఉంటే మిగిలిన 25 శాతం కూడా తీసుకోవచ్చని అన్నారు. అయితే పెళ్లి కోసం ఉద్యోగం మానేసిన మహిళా ఉద్యోగుల విషయంలో ఈ రెండు నెలల నిబంధన వర్తించదు.

కొత్త పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు

  • ఈపీఎఫ్ మెంబర్  నెల రోజులపాటు నిరుద్యోగిగా ఉంటే పీఎఫ్ సొమ్ములో 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో ఖాతాను కొనసాగించవచ్చు.
  • రెండు నెలలపాటు ఉద్యోగాల లేకపోతే ఈపీఎఫ్ ఖాతాలోని మిగిలిన 25 శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో ఖాతాను పూర్తిగా రద్దు చేసుకొనే అవకాశం ఉంది.
  • సభ్యులు తమ ఖాతాను కొనసాగించేందుకు మరో అప్షన్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఉద్యోగం వస్తే వారి ఖాతాను తిరిగి కొనసాగించవచ్చు. కొత్త ఉద్యోగం పొందినప్పుడు..కొత్త ఖాతాలోకి పాత ఖాతా డబ్బులను బదిలీ చేసుకొనే అవకాశం కల్పించారు.
  • ప్రస్తుతం 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పీఎఫ్ ఖాతాను కొనసాగిస్తున్న సభ్యులు పెన్షన్ పథకం పొందేందుకు అర్హులు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగం లేకపోవడం కారణంగా పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని  విత్‌డ్రా చేసుకుంటారో వారు పెన్షన్ పొందేందుకు అనర్హులు.

ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఈటీఎఫ్‌లలో రూ.47,431 కోట్లను పెట్టుబడిగా పెట్టామనీ, దానిపై 16.07% ప్రతిఫలం లభిస్తోందని . త్వరలోనే ఈ పెట్టుబడులు రూ.లక్ష కోట్లు దాటుతాయన్నారు కేంద్ర కార్మిక సాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌.

English Title: 
Now, you can withdraw 75% of PF amount after one month of unemployment
News Source: 
Home Title: 

30 రోజుల్లో ఉద్యోగం రాకపోతే..

30 రోజుల్లో జాబ్ రాకపోతే.. 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
30 రోజుల్లో ఉద్యోగం రాకపోతే..