ఫిట్‌నెస్ నిరూపించుకున్న మోడీ ; కుమారస్వామికి ఛాలెంజ్

                         

Updated: Jun 13, 2018, 09:02 PM IST
ఫిట్‌నెస్ నిరూపించుకున్న మోడీ ; కుమారస్వామికి ఛాలెంజ్

కర్నాటక సీఎం కుమారస్వామికి ప్రధాని మోడీ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా తాను చేస్తున్న ఎక్సర్ సైజ్ కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. కుమారస్వామితో పాటు కామన్ వెల్త్ పతక విజేత మోనికా బాత్రాతో పాటు 40 ఏళ్లు పైబడిన ఐఏఎస్ అధికారులకు ఆయన ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు.

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రధాని మోడీకి ఫిట్ నెస్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. విరాట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన మోడీ ..ఈ రోజు తన ఫిట్ నెస్ నిరూపించుకొని ఇతరులకు ఛాలెంజ్ చేశారు. ప్రధాని మోడీ తన మంత్రి వర్గ సహచరులు.. పార్టీ నేతలను వదిలి కర్నాటక సీఎం కుమారస్వామికే ఫిట్ నెస్ ఛాలెంజ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయంశంగా మారింది.

ప్రధాని మోడీ ఫిట్ నెట్ కు సంబంధించిన వీడియాలో పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశంలతో మమేకమై ఎంతో ప్రేరణ పొందవచ్చని పేర్కొన్నారు. యోగాతో ఆనందంగా జీవితాన్ని గడపవచ్చని వెల్లడించారు. మోదీ ఫిట్ నెస్ కోసం సాధన చేస్తున్న వీడియోనూ చూసి ఎంజాయ్ చేయండి..

 

ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడల ఆవశ్యకతకు తెలియజేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఖేల్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. క్రీడలు,ఎక్సర్ సైజ్ ద్వారా ఫిటినెస్ సాధించవ్చని ..తద్వారా ఆనందమయ జీవితాన్ని గడవచ్చనేది దీని ఉద్దేశం. దీని ప్రచారంలో భాగంగా క్రీడాశాఖ మంత్రి రాథోడ్ తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియో షేర్ చేసి టీమిండియా కెప్టెన్ విరాట్ కు ఛాలెంజ్ చేశారు. ఇలా మొదలైంది ఈ ఆట. అక్కడి నుంచి విరాట్ కోహ్లీ .. ప్రధాని మోడికి ఫిట్ నెస్ ఛాలెంజ్ విసరడం ..దీన్ని సవాల్ గా తీసుకున్న మోడీ తన ఫిట్ నెస్ ను నిరూపించుకునే వీడియోను షేర్ చేసి ఇతరులకు ఇలా ఫిట్ నెస్ ఛాలెంజ్ చేశారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close