90 వేల రైల్వే ఉద్యోగాలకు... 2.3 కోట్ల అప్లికేషన్లు..!

భారతీయ రైల్వే ఇటీవలే కాలంలో దాదాపు 90 వేల ఖాళీలను పూరించడానికి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

Last Updated : Apr 25, 2018, 12:03 AM IST
90 వేల రైల్వే ఉద్యోగాలకు... 2.3 కోట్ల అప్లికేషన్లు..!

భారతీయ రైల్వే ఇటీవలి కాలంలో దాదాపు 90 వేల ఖాళీలను పూరించడానికి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల కోసం రికార్డు స్థాయిలో దాదాపు 2.3 కోట్లమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. అందులో లోకోపైలట్లు, టెక్నిషీయన్ పోస్టులకు 47.56 లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1.90 కోట్లమంది అభ్యర్థులు గ్రూప్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన టెస్టులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఆ టెస్టు నిర్వహించడానికి ముందు అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా మాక్ టెస్టు కూడా నిర్వహించే ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే అప్లికేషన్లు పంపిన అభ్యర్థులకు ఈ టెస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఎస్సెమ్మెస్, ఈమెయిల్ ద్వారా పంపిస్తామని రైల్వే శాఖ తెలిపింది.

ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పంపే తుది గడువు తేది మార్చి 31, 2018తో పూర్తయ్యింది. ఏప్రిల్ లేదా మే నెలలలో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పోస్టులకు అదనంగా రైల్వే శాఖ మార్చిలో మరో 9500 పోస్టులు ఖాళీ అయినట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.  

Trending News