రూ.2000 నోట్ల అదృశ్యం వెనుక పెద్ద కుట్రే ఉంది..!

పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ తీసుకొచ్చిన రూ.2000 నోట్ల చలామణి ఇటీవలి కాలంలో తగ్గిపోయింది. ఏటీఎంలలో కూడా ఈ నోట్లు తక్కువగానే వస్తున్నాయి. రూ.200 నోట్లు, రూ.500 నోట్లు, రూ.100 నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. రూ.2000 నోట్లు మార్కెట్‌ నుంచి అదృశ్యమైపోతున్నాయని వ్యాఖ్యానించారు. దీని వెనుక అతిపెద్ద కుట్రే ఉందని ఆయన ఆరోపించారు.

మధ్యప్రదేశ్ లోని సర్జాపూర్ జిల్లాలో  రైతుల సమావేశంలో పాల్గొన్న చౌహాన్‌, డిమానిటైజేషన్‌కు ముందు రూ.15 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండేవని తెలిపారు.  డిమానిటైజేషన్‌ తర్వాత కరెన్సీ సర్క్యూలేషన్‌ రూ.16.5 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. రూ.2000 డినామినేషన్‌ నోట్లు ఎక్కడికి పోతున్నాయ్‌? వాటిని ఎవరూ సర్క్యూలేషన్‌ నుంచి బయటికి తీసుకుపోతున్నారు? నగదు కొరతకు బాధ్యులెవరు? ఈ సమస్యలను సృష్టించడానికి ఏదో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారన్నారు.  దీనిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లనున్నట్టు శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ  కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

English Title: 
Rs 2000 Notes 'Vanishing' in Madhya Pradesh, CM Shivraj Singh Chouhan Sees Conspiracy
News Source: 
Home Title: 

రూ.2000 నోట్ల అదృశ్యం వెనుక పెద్ద కుట్రే ఉంది..!

రూ.2000 నోట్ల అదృశ్యం వెనుక పెద్ద కుట్రే ఉంది..!
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
రూ.2000 నోట్ల అదృశ్యం వెనుక పెద్ద కుట్రే ఉంది..!