జుట్టు రాలుతోందని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్

కోరుకున్న ఉద్యోగం రాలేదని, ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని, ఇంట్లోవాళ్లు ఇష్టమైన మొబైల్ కొనివ్వలేదని, నచ్చిన అమ్మాయి ప్రేమించలేదని... ఇలా రకరకాల కారణాలతో క్షణికావేశంలో చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ఎంతో విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటోంది నేటి యువత. తాజాగా బెంగుళూరులో జరిగిన ఇటువంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. చర్మ వ్యాధితో తలపై జుట్టు ఊడిపోతోందని మనస్తాపం చెందిన ఓ 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

బెంగుళూరుకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోన్న 27 ఏళ్ల ఆర్ మిథున్ రాజ్ ఇటీవల కాలంలో ఓ చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ చర్మ వ్యాధి కారణంగా మిథున్ రాజ్ తలపై వెంట్రుకలు ఊడిపోవడం మొదలైంది. పలురకాల చికిత్సలు తీసుకుని మందులు ఉపయోగించినప్పటికీ ఫలితాలు కనిపించలేదు. ఇదే విషయమై తన తల్లి వాసంతికి కూడా చెప్పుకుని ఆవేదన వ్యక్తంచేసిన మిథున్ రాజ్.. ఆమె గుడికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేనిది చూసి సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకున్నాడు. ఫ్యాన్‌కి ఉరేసుకున్న మిథున్‌ని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.

English Title: 
Software engineer committed suicide after he was suffering from hair fall
News Source: 
Home Title: 

జుట్టు రాలుతోందని ఇంజనీర్ సూసైడ్

జుట్టు రాలుతోందని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes