మక్కా మసీదు పేలుడు కేసు: తీర్పు ఇచ్చిన జడ్జి రాజీనామా

హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం నమోదు చేసిన మక్కా మసీదు పేలుడు కేసులో తీర్పు ఇచ్చిన ఎన్‌ఐఏ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. 

Updated: Apr 17, 2018, 06:03 AM IST
మక్కా మసీదు పేలుడు కేసు: తీర్పు ఇచ్చిన జడ్జి రాజీనామా
Image Credit: ANI

హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం నమోదు చేసిన మక్కా మసీదు పేలుడు కేసులో తీర్పు ఇచ్చిన ఎన్‌ఐఏ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్‌కి పంపించారు. ప్రస్తుతం ఈ రాజీనామా ఘటన అనేక సందేహాలకు తావిస్తోంది. 2007 మే 18న హైదరాబాద్‌లో జరిగిన మక్కా మసీదు పేలుడు ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులకు న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పును న్యాయమూర్తి హోదాలో వెలువరించిన రవీందర్ రెడ్డి ప్రస్తుతం రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాకి వేరే ఇతరత్రా కారణాలు కూడా ఉండవచ్చని పలు పత్రికలు వార్తలు రాస్తున్నాయి. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని గతంలో రవీందర్ రెడ్డి డిమాండ్ చేసి సస్పెండ్ అయ్యారు.

అలాగే ఈ మధ్య కాలంలో పలువురు న్యాయవాదులు రవీందర్ రెడ్డిపై ఏసీబీకి కూడా ఫిర్యాదులు చేశారు. పీటీఐ ప్రచురించిన వార్తల ప్రకారం రవీంద్ రెడ్డి తన వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే రాజీనామా చేశారు తప్పితే.. మక్కా మసీదు కేసుకి ఈ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారని తెలుస్తోంది.

సోమవారం మక్కా మసీదు పేలుడు కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి అసీమానందతో పాటు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసీమానంద తరఫున న్యాయవాది జె.పి.శర్మ మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొన్న వారికి సంబంధించి తగు సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిలవ్వడం వల్లే వారిని నిర్దోషులుగా ప్రకటించారని తెలిపారు

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close