'వాలెంటైన్స్ డే' రోజు క్యాంపస్‌కు సెలవు

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో విశ్వవిద్యాలయం ప్రేమికుల రోజు సెలవు ప్రకటించింది.

Updated: Feb 14, 2018, 01:36 PM IST
'వాలెంటైన్స్ డే' రోజు క్యాంపస్‌కు సెలవు

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో విశ్వవిద్యాలయం ప్రేమికుల రోజు సెలవు ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని కూడా నేడు క్యాంపస్‌కు సెలవు ప్రకటించారు. అలానే మరుసటి రోజు కూడా సెలవుదినంగా ప్రకటించారు యాజమాన్యం. 'వాలెంటైన్స్ డే' అనేది పాశ్చ్యాత్య సంస్కృతిని, ఆ పండగను జరుపుకోవద్దని బోర్డులో నోటీసులు అతికించారు.

 

విద్యార్థులు క్యాంపస్‌కి వచ్చి ఒకరికొకరు రోజాపూలు, చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటున్నారని, ఇక మీదట అలా జరగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. బుధవారం రోజున తరగతులు, ప్రాక్టికల్స్ లాంటివి ఏవీ జరగవని.. ఎవరైనా క్యాంపస్‌లో కనిపిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంగా నోటీసులో పేర్కొంది. విద్యార్థుల తల్లితండ్రులు కూడా 'వాలెంటైన్స్ డే' రోజున పిల్లలను బయటకు పంపించవద్దని  సూచించింది.