మహిళల జననాంగ ఛేదన అంశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

మహిళల జననాంగ ఛేదన అంశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

Last Updated : Sep 24, 2018, 10:25 PM IST
మహిళల జననాంగ ఛేదన అంశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

ముస్లింలోని కొన్ని సామాజిక వర్గాల్లో అవలంభిస్తున్న మహిళల జననాంగ ఛేదన (ఎఫ్‌జీఐ)ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ఛేదన చర్య ద్వారా బాలల హక్కులను హరించడమే అని ఢిల్లీకి చెందిన ఓ లాయర్ పిల్ దాఖలు చేశాడు. ఈ పిల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విన్నది.  

పిల్‌లో లాయర్ ప్రస్తావిస్తూ.. మహిళల జననాంగ వైకల్యానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల మధ్య మరియు యుక్త వయసు వచ్చే ముందు బాలికలపై జననాంగ ఛేదన చర్యలను అవలంభిస్తున్నారని.. ఇది ఐరాస బాలల హక్కులకు, మానవ హక్కులకు వ్యతిరేకమని తెలిపారు. ఐరాస ప్రతిపాదించిన ఈ హక్కులపై భారతదేశం సంతకం కూడా చేసిందని పిల్‌లో ప్రస్తావించారు. దీనివల్ల స్త్రీ శరీరంలో శాశ్వత లోపం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.  

ఈ వాదనతో గతంలోనూ కోర్టు ఏకీభవించింది. అయితే దీనిపై లోతైన విశ్లేషణ, అధ్యయనం చేయాలని దావుదీ బోహ్రా వర్గ ముస్లింలు కోరారు. దీంతో ఈ అంశాన్ని పరిశీలించాలని రాజ్యాంగ ధర్మాసనానికి.. సీజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ సోమవారం తెలిపింది.

Trending News