కరుణానిధికి ఘన నివాళి అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్

కరుణానిధికి ఘన నివాళి అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Updated: Aug 8, 2018, 05:45 PM IST
కరుణానిధికి ఘన నివాళి అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్
ANI Photo

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధికి ఘన నివాళి అర్పించారు. బుధవారం ఉదయం చెన్నై వెళ్లిన కేసీఆర్.. నేరుగా రాజాజీ హాల్‌కి చేరుకుని అక్కడ కరుణానిధి పార్థివదేహానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కరుణానిధి ఆత్మకు శాంతికి చేకూరాల్సిందిగా ప్రార్థించిన కేసీఆర్... కరుణానిధికి అనుకూల నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వెళ్లిన ఆయన కుమార్తె, నిజామాబాజ్ ఎంపీ కవిత కూడా కరుణానిధికి నివాళి అర్పించి అక్కడే ఉన్న కరుణానిధి కుమార్తె కనిమొళిని ఓదార్చారు.