బహుభార్యలను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్

భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఒక పోలీసు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. పోలీసులు అతనిని విచారించగా.. ఆరోపణలు నిజమని తెలియడంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

Updated: Jan 10, 2018, 11:34 AM IST
బహుభార్యలను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్

మహారాష్ట్ర, థానే: భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఒక పోలీసు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. తనభర్త బహుభార్యలను కలిగి ఉన్నాడని మొదటి భార్య పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిని విచారించగా.. ఆరోపణలు నిజమని తెలియడంతో ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. సూర్యకాంత్ కదం 1992లో మొదటిసారి వివాహం చేసుకున్నారు. ఆతరువాత 1993 నుండి 2014 వరకు మొత్తంగా ఏడుగురిని వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఏడుగురిలో ఇద్దరు మరణించగా.. ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. విచారణ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.