టెన్త్ పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు.. 5 లక్షల మంది డుమ్మా..!

ఉత్తరప్రదేశ్‌ విద్యా శాఖ ఇటీవలే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

Updated: Feb 10, 2018, 12:07 AM IST
టెన్త్ పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు.. 5 లక్షల మంది డుమ్మా..!

ఉత్తరప్రదేశ్‌ విద్యా శాఖ ఇటీవలే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తమ రాష్ట్రంలో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే ఈ వార్త వినీవినగానే దాదాపు పరీక్షలకు హాజరవకుండా అయిదు లక్షలమంది విద్యార్థులు డుమ్మా కొట్టారట.

దాదాపు ఈ యేడు 70 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఈ పద్థతి అమలుచేశాక మొదటి రోజు దాదాపు  5 లక్షలమంది విద్యార్థులు డుమ్మా కొట్టడంతో ఆశ్చర్యపోయారు అధికారులు.

ఇటీవలే యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. పరీక్షల సమయంలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేయడం కోసమే ఈ పథకమని ఆయన తెలిపారు. ఈ కొత్త పద్ధతిని సరిగ్గా అమలుచేయమని ఆయన ఇప్పటికే ఆ రాష్ట్ర విద్యాశాఖకు సూచించారు