ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం

ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.

Updated: Mar 13, 2018, 04:02 PM IST
ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం

ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు దుర్ఘటన జరిగింది. ఆల్మోరా జిల్లా తోటమ్ గ్రామం సమీపంలో 24 మంది ప్రయాణీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. క్షతగాత్రులను ప్రమాదస్థలి నుండి సమీప హాస్పిటల్ కు తరలించారు.

 

ఏఎన్ఐ కథనం మేరకు, రామనగర్- ఆల్మోరా మధ్య బస్సు ప్రమాదం జరిగిందని తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

ప్రయాణీకులను రక్షించడానికి రెస్క్యూ టీం సంఘటనా స్థలికి వెళ్లింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందం, జిల్లా పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, చనిపోయినవారికి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని అల్మోరా జిల్లా కలెక్టర్ కు సీఎం ఆదేశించారు.