జూకి వెళ్లి సింహం ఎన్‌క్లోజర్‌లోకే దూకాడు!

సింహాలు వుండే ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన వ్యక్తిని అక్కడి సిబ్బంది అతి కష్టమ్మీద బయటికి లాక్కొస్తున్న వైనం

Last Updated : Feb 21, 2018, 08:03 PM IST
జూకి వెళ్లి సింహం ఎన్‌క్లోజర్‌లోకే దూకాడు!

సాధారణంగా ఎవరైనా జూకి ఎందుకు వెళ్తారు ? సరదాగా జూలో జంతువులని చూసి, అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్తారు కానీ ఇదిగో ఈ వ్యక్తి మాత్రం జూకి వెళ్లి అక్కడ జంతువులని చూసి సరిపెట్టుకోకుండా ఏకంగా వెళ్లి సింహాలు వుండే ఎన్‌క్లోజర్‌లోకే దూకాడు. అంతటితో ఆగకుండా ఎన్‌క్లోజర్‌లో సింహాల బోనువైపు అడుగులేశాడు. అది చూసిన జూ సిబ్బంది.. సింహాలు అతడిని కనిపెట్టకముందే వెంటనే అతడిని అక్కడి నుండి బయటికి లాక్కొచ్చారు. వినడానికి కొంచెం విచిత్రంగా వున్న ఈ ఘటన తిరువనంతపురంలో బుధవారం చోటుచేసుకుంది. 

 

సింహాలు వుండే ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన వ్యక్తిని అక్కడి సిబ్బంది అతి కష్టమ్మీద బయటికి లాక్కొచ్చిన తీరుని అక్కడే వున్న జూ సందర్శకులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన వ్యక్తిని మురుగన్‌గా గుర్తించారు. కేరళలోని పాలక్కడ్‌కి చెందిన మురుగన్ ఈమధ్యే కనిపించడం లేదంటూ అతడి కుటుంబసభ్యులు న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

మురుగన్ ఈ దుస్సాహసానికి పాల్పడినప్పుడు ఎన్‌క్లోజర్‌లో వున్న సింహాలు అక్కడే తిరుగుతున్నట్టు ఎక్కడా జాడ కనిపించలేదు. బహుశా ఆ సమయంలో సింహాలు బోనులో వుండి వుండుంటాయి. అందుకే మురుగన్ ప్రాణాలతో బతికి బట్టకట్టాడు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Trending News