ఐరాసలో హిందీని అధికార భాష చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?

బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపి శశి థరూర్ ఐక్యరాజసమితిలో హిందీ భాషను అధికారిక భాషగా చేయాల్సిన ఉద్దేశ్యం ఏమిటో ప్రశ్నించగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.

Updated: Jan 3, 2018, 07:07 PM IST
ఐరాసలో హిందీని అధికార భాష చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?

బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపి శశిథరూర్ ఐక్యరాజసమితిలో హిందీభాషను అధికారిక భాషగా చేయాల్సిన ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించగా విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. బిజేపీ ఎంపీలు లక్ష్మణ్ గిల్వావా, రమాదేవి యూఎన్‌లో హిందీని అధికార భాషగా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి.. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలని సభ్యులు కోరుకుంటున్నారని అడిగారు. 

విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ ఈ ప్రక్రియకు మూడింట రెండువంతుల మెజారిటీ ఓటు అవసరమవుతుందని, హిందీ మాట్లాడే ఇతర దేశాలు భాషను అధికారికంగా గుర్తించడానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. "మేము ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మారిషస్ వంటి చిన్న దేశాలు చెల్లించలేవు. మేము వారితో చర్చలు చేస్తున్నాం" అని సుష్మ స్వరాజ్ అన్నారు.

మంత్రి మాట్లాడాక, ప్రతిపక్షనేత శశిథరూర్ స్పందిస్తూ, "ఐక్యరాజసమితిలో హిందీ అధికారిక భాషగా చేయటానికి ప్రయత్నించడం ద్వారా ఏం ప్రయోజనం చేకూరుతుంది? నేను అర్థం చేసుకోగలను.. ప్రధానమంత్రి, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి హిందీలో మాట్లాడగలరు. కానీ భవిష్యత్తులో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఆ భాషలో మాట్లాడగలరా?" అని అన్నారు. 

భారత్‌లో హిందీకి జాతీయ భాషా హోదా ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఇది అధికారిక భాష కాదు అని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఐక్యరాజసమతిలో ఆరు అధికారిక భాషలు ఉన్నాయి. కానీ వాటిలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలకే పెద్దపీట. "మన దేశంలో హిందీ, ఇంగ్లిష్ ఎలాగో అలాగన్నమాట" అని ఆయన చెప్పారు. 

హిందీని కేవలం భారత్‌లోనే కాదు.. ఫిజి, మారిషస్, సురినామ్, ట్రినిడాడ్ & టొబాగో, గయానా వంటి ఇతర దేశాల్లో, అలాగే అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు మాట్లాడుతున్నారు" అని సుష్మాస్వరాజ్ బదులిచ్చారు.

2016 పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంలో సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ, యూఎన్‌లో హిందీకి అధికారిక భాష హోదాను కల్పించేందుకు ప్రతి ప్రయత్నం చేస్తున్నట్లు వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ''హిందీని యూఎన్ అధికార భాషగా గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ప్రభుత్వ కృషి కొనసాగుతోంది. ఈ విషయంలో, యునైటెడ్ నేషన్స్ బ్రాడ్కాస్టింగ్  యూఎన్ రేడియో వెబ్సైట్లో దాని కార్యక్రమాలను హిందీ భాషలో ప్రసారం చేసిందని మంత్రి బదులిచ్చారు.  

భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్‌లో 22 అధికారిక భాషలు ఉన్నాయి. మొదటిసారి రాజ్యాంగం గుర్తించిన భాషలు 14. 1967లో సింధీకి, 1992లో కొంకణి, మణిపురి, నేపాలికి, 2004లో బోడో, డోగ్రి, మైథిలి, సంతాలికి అధికారిక హోదా ఇవ్వబడింది. థరూర్ ఇదివరకు యూఎన్‌లో కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంటుకి అండర్ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close