యోగీ గారు కూడా మామూలు ఖిలాడీ కాదు : ప్రధాని మోడీ

'ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మామూలు ఖిలాడీ కాదు' అని యూపీ సీఎంపై ప్రసంశల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.

Updated: Jan 13, 2018, 02:28 PM IST
యోగీ గారు కూడా మామూలు ఖిలాడీ కాదు : ప్రధాని మోడీ

'ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మామూలు ఖిలాడీ కాదు' అని యూపీ సీఎంపై ప్రసంశల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ట్విటర్‌లో మహామహులని కూడా యోగి ఆదిత్యనాథ్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు అంటూ యోగి పట్ల తనకు వున్న అభిమానాన్ని చాటుకున్నారు మోడీ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి మధ్య ఇటీవల పలు సందర్భాల్లో ట్విటర్ వేదికగా వాడివేడి వాగ్యుద్ధాలు జరిగాయి. ఇద్దరూ ట్విటర్‌లో సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలోనే యోగి ట్విటర్‌లో మహామహులకి సవాళ్లు విసిరిన ఖిలాడీ అంటూ యోగి ఆదిత్యనాథ్‌ని తనదైన స్టైల్లో అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ.

 

ఇటీవల కర్ణాటకలో గోవథపై నిషేధం విధించాల్సిందిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు. యోగి డిమాండ్‌పై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. తాను మైదనాల్లో గోవులని మేపానని, వాటి పేడ కూడా ఎత్తానని అన్నారు. ఇవన్నీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేశారా అని ప్రతిసవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా ఇరువురి మధ్య పలు వాదనలు కూడా జరిగాయి. యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ ట్వీట్ వార్‌ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోడీ ఇలా స్పందించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.