టాలీవుడ్ సిక్స్ ప్యాక్ హీరోల డైట్ సీక్రెట్స్ ఇవే

టాలీవుడ్ సిక్స్ ప్యాక్ హీరోల డైట్ సీక్రెట్స్ ఇవే

Last Updated : Sep 19, 2018, 04:04 PM IST
టాలీవుడ్ సిక్స్ ప్యాక్ హీరోల డైట్ సీక్రెట్స్ ఇవే

డైట్ అనేది ఆహారపు అలవాట్లలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డైట్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడూ తోడ్పాటునిస్తుంది. సందర్భాన్ని బట్టి డైట్‌లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రీడాకారులు, సినిమా నటులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో మనం ఇప్పుడు టాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్ చూపించిన పలువురు నటుల డైట్ సీక్రెట్స్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం..!

జూ.ఎన్టీఆర్: టాలీవుడ్‌లో ప్రముఖ నటుల్లో జూ.ఎన్టీఆర్ ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ అందరిని ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తీసుకొనే డైట్‌లో చల్లని పదార్థాలు, కాయగూరలు, పండ్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం ఉంటుందట. డైట్‌లో భాగంగా అప్పుడప్పుడు తక్కువ మోతాదులో మీల్స్ తీసుకుంటారట.

అల్లు అర్జున్: తెలుగు సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. బన్నీ  ఓసారి బాలీవుడ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. అప్పుడు ఓ యాంకర్ అతడ్ని మీ సౌత్ ఇండియాలో నటులు ఫిట్నెస్‌కి ప్రాధాన్యత ఇవ్వరని అనడంతో బన్నీ దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని 'దేశముదురు' సినిమాతో ఆ యాంకర్ నోరు మూయించాడు. డైట్‌ను పక్కాగా ఫాలో అయ్యే అల్లు అర్జున్.. ప్రోటీన్ కలిగి ఉన్న ఆహారాన్ని, గుడ్డు తెల్లసొనను మాత్రమే తీసుకుంటాడు. కొవ్వు పదార్థాలను ముట్టుకోడు.

నితిన్: టాలీవుడ్‌లో 8 ప్యాక్స్ చూపించిన నటుడు నితిన్. డైట్‌లో భాగంగా రోజూ 24 గుడ్డు తెల్లసొనలు, కేజీన్నర గ్రిల్ చికెన్, మూడు ప్రోటీన్ జ్యూస్‌లు తీసుకుంటాడట. ఉదయం పూట 12 గుడ్ల తెల్ల సొనలు, ఒక ప్రోటీన్ జ్యూస్‌.. మధ్యాహ్నం గ్రిల్ చికెన్ తీసుకుంటాడట. ఇలా తీసుకోబట్టే 'విక్టరీ' సినిమాలో ఆ బాడీ చూపించాడట.

మహేష్ బాబు: మహేష్ బాబు 'వన్:నేనొక్కడినే' సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించిన సంగతి తెలిసిందే. ఆయన ఓట్స్, పాస్తా, స్పినాచ్, చేపలు, గ్రిల్ చికెన్‌లను ఆహారంగా తీసుకుంటారట. ఇలా ఆయన తీసుకున్న ఆహారంతో మూడు నెలల్లో తన శరీరాకృతిని మార్చుకొని 'నేనొక్కడినే' సినిమాలో చూపించాడట.

ప్రభాస్: 'బాహుబలి' సినిమాలో రానా, ప్రభాస్‌ల శరీరాకృతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రెండున్నర గంటల కొకసారి ప్రభాస్ ఆహారాన్ని తీసుకొనేవాడట. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ పౌడర్‌తో కలిపిన 40 గుడ్ల తెల్లసొనలను తీసుకునేవాడు. కార్బోహైడ్రేట్ పదార్థాలను ముట్టుకోకుండా.. గింజలు, చేపలు, బాదం లాంటి ప్రోటీనులు అధికంగా ఉండే పదార్థాలను తీసుకునేవాడు. ఇలా తీసుకున్న ఆహారంతో రోజూ 2-4వేల కేలరీలను పొందేవాడట.
 

రానా: 'బాహుబలి' సినిమాలో రానా ఆ శరీరాకృతిని పొందటానికి ఉదయం ఓట్స్, బ్రెడ్, ఎనిమిది గుడ్ల తెల్ల సొనలు, పుచ్చకాయ, బొప్పాయి లాంటివి తీసుకొనేవాడట. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్య ప్రోటీన్లు కలిగి ఉన్న పండ్ల రసాన్ని తాగేవాడట. పోటీన్లు కలిగి ఉన్న ఒమేగా-3 చేపలు, ఆకుపచ్చని కాయగూరలు తీసుకొనేవాడు. సాయంత్రం 4 బ్రెడ్ స్లైస్‌లు,అరటి పండ్లు.. రాత్రికి ప్రోటీన్ల ఆహారాన్ని తినేవాడట.  

నాగార్జున: నాగార్జున 'ఢమరుకం' సినిమాలో ఆ శరీరాకృతిని చూపించడానికి ఉదయం గుడ్డు తెల్లసొనలు, బ్రెడ్.. మధ్యాహ్నం రైస్, రోటీ, నాలుగు కర్రీలు.. రాత్రి ప్రోటీన్లు కలిగి ఉన్న చేపలు, గ్రిల్ చికెన్ తీసుకొనేవాడట. ఉదయం-మధ్యాహ్నం మధ్యలో దోస/పెసరట్టు/పొంగల్ తీసుకొనేవాడట.

సునీల్: సునీల్ 'పూలరంగడు' సినిమాలో ఆ శరీరాకృతిని చూపించడానికి గుడ్డు తెల్ల సొన, నీళ్లు తాగేవాడట. రోజూ ఐస్ క్యూబ్స్, 12 గుడ్డు తెల్ల సొనలు తినేవాడట. 

Trending News