టీ-షర్టు అసలు కథ తెలుసా?

చాలా మంది టీ-షర్టులు వేసుకుంటుంటారు. రంగురంగుల టీ-షర్టులు వేసుకొని రోడ్ల మీద సరదాగా తిరుగుతుంటారు.

Updated: Jan 20, 2018, 01:17 PM IST
టీ-షర్టు అసలు కథ తెలుసా?

చాలామంది టీ-షర్టులు వేసుకుంటుంటారు. రంగురంగుల టీ-షర్టులు వేసుకొని రోడ్ల మీద సరదాగా తిరుగుతుంటారు. నేడు టీషర్టులు రకరకాల ఫ్యాషన్‌లలో దొరుకుతున్నాయి. యువత ఎక్కువగా వీటిని ఇష్టపడతారు. ఈ రోజు మనం టీషర్టుల చరిత్ర గురించి కూడా కొంత తెలుసుకుందాం.

అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్టుల వంటి లోదుస్తులను (బనియన్లు-భారతీయ భాష) ధరించి యుద్ధం చేస్తున్నారు. అమెరికా సైన్యం జవాన్ డ్రెస్లను ధరించి యుద్ధం చేస్తోంది. యూరోపియన్లు హాయిగా యుద్ధం చేస్తుంటే.. అమెరికన్లు ఆ దుస్తుల వల్ల చెమటలు కక్కుతూ ఉండేవారు. కొన్నాళ్ళకు అమెరికా కూడా ఆ లోదుస్తుల్లాంటి టీ-షర్టులవైపే మొగ్గు చూపింది. ఆ తరువాత ఆ లోదుస్తులకే డిమాండ్ పెరిగింది. చూడ్డానికి ఆంగ్ల అక్షరం 'టీ' ఆకారంలో ఉంది కనుకే దీనిని 'టీ'షర్టు అని పేరొచ్చింది. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేటప్పుడు, ఇతర ఉద్యమాలప్పుడు ప్రజలు టీ-షర్టుల మీద నినాదాలు రాసుకొని తిరుగుతుండేవారు. 1950లో టీ-షర్టు యూరప్, అమెరికా దేశాలలలో బాగా పాపులర్ అయ్యింది. అవి ప్రచార సాధనాలుగా కూడా ఉపయోగపడ్డాయి.

మీకో విషయం తెలుసా? అమెరికా మాజీ అధ్యక్షుడికి టీ-షర్టులంటే చాలా ఇష్టం. ఆయన వాడే టీ-షర్టులు ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన భాగ్యనగరంలోనే.