ఆ గడియారం ఖరీదు.. 116 కోట్లు

ఒక సాధారణ వాచీ ఏకంగా 116 కోట్లకు అమ్ముడైపోయిందంటే మీరు నమ్ముతారా? అయితే ఈ కథనం చదవండి అందులో వున్న ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది. 

Updated: Jan 2, 2018, 05:36 PM IST
ఆ గడియారం ఖరీదు.. 116 కోట్లు

ఇప్పటివరకు మీరు కోట్ల రూపాయలు విలువచేసే ఖరీదైన చేతి వాచీలు చూసింటారు. అవి వజ్రం, బంగారం, విలువైన జాతిరాళ్లతో తయారుచేసింటారు కనుక వాటికి ఆ ధర. మరి ఒక సాధారణ వాచీ ఏకంగా 116 కోట్లకు అమ్ముడైపోయిందంటే మీరు నమ్ముతారా? అయితే ఈ కథనం చదవండి అందులో వున్న ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది. 

ఇటీవల న్యూయార్క్‌లో ఒక రోలెక్స్ చేతివాచీని వేలం వేశారు. అది స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసింది. దాన్ని రూ. 116 కోట్లలకు కొనుక్కున్నారు ఒకరు. ఈ చేతి గడియారాన్ని గతంలో దివంగత హాలీవుడ్ నటుడు పాల్ న్యూమాన్ వాడారు. ఆయన రెండో భార్య దీన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. 'విన్నింగ్ టుగెదర్' మూవీ జరుగుతున్నప్పుడు ఆమె దీనిని న్యూమాన్‌కు ఇచ్చారు. దీనిపై 'జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి' అని రాయించారు అమె. ఆ తర్వాత 1984లో వుడ్‌వర్డ్స్‌ (రెండో భార్య) మరో గడియారాన్ని ఇవ్వగా పాత డేటోనా రోలెక్స్‌ను తన కుమార్తెకు ఇచ్చారు న్యూమాన్. అది చివరికి న్యూమన్‌ కుమార్తె స్నేహితుడు జేమ్స్‌ కాక్స్‌ వద్దకు చేరింది. 

తాజాగా కాక్స్‌ ఈ చేతి గడియారాన్ని వేలానికి పెట్టాడు. వేలంలో పాల్గొన్న ఒక వ్యక్తి దీనిని 17.8 మిలియన్‌ డాలర్లకు (రూ. 116 కోట్ల రూపాయలు) సొంతం చేసుకున్నాడు. ఆ వచ్చిన డబ్బులో  కొంత న్యూమన్‌ ఫౌండేషన్‌కు ఇస్తున్నాడు.