చిన్న ఇల్లుతో డబ్బు, సమయం ఆదా !

ఇల్లు పెద్దగా ఉంటే మంచిదా? చిన్నగా ఉంటే మంచిదా? అంటే చిన్నగా ఉంటేనే బెటర్ అంటున్నారు చాలామంది.

Updated: Jan 29, 2018, 12:08 AM IST
చిన్న ఇల్లుతో డబ్బు, సమయం ఆదా !

ఇల్లు పెద్దగా ఉంటే మంచిదా? చిన్నగా ఉంటే మంచిదా? అంటే చిన్నగా ఉంటేనే బెటర్ అంటున్నారు చాలామంది. చిన్నగా ఉన్న ఇల్లుతో డబ్బు ఆదా అవుతుందని, టైం కూడా కలిసొస్తుందంటున్నారు. అదెలాగో చూద్దాం..!
 
* ఇల్లు చిన్నగా ఉంటే నిర్వహణ ఖర్చు తక్కువే అవుతుంది. ఖాళీ స్థలాన్ని అలంకరణ వస్తువులతో నింపాల్సిన పని ఉండదు. 

* తక్కువ స్థలం ఉన్నప్పుడు కొనే వస్తువులు కూడా తక్కువగానే ఉంటాయి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుక్కుంటారు. 

* ఇల్లు చిన్నగా ఉంటే బంధాలు కూడా బాగుంటాయి. విశాలమైన ఇంట్లో గదులు ఎక్కువ. అక్కడ నివసించే వారిలో సంబంధ బాంధవ్యాలు అంత చెప్పుకోదగ్గ విధంగా ఉండవు అని చెబుతోంది ఓ విదేశీ స్టడీ. అదే చిన్నఇంట్లో అందరూ కలిసి ఒకేచోట కూర్చోవడం, విషయాలు పంచుకోవడం చేసుకోవడం వల్ల బంధాలు నిజంగానే బలపడతాయి. 

* ఇల్లు పెద్దగా ఉంటే శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే చిన్నగా ఉంటే తక్కువ సమయంలో ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. సమయం ఆదా అవుతుంది. ఆ సమయాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు.  

* పెద్ద ఇల్లును డెకరేట్‌ చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చిన్నఇంటిని అభిరుచికి తగ్గట్టు అలంకరించుకోవచ్చు. డబ్బు ఆదా అవుతుంది.. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి.