బాబోయ్.. లుంగీ ధర ఆరువేలా?

ఇండియాలో ఎక్కడైనా సాధారణంగా లుంగీ ధర ఎంత ఉంటుంది? 

Updated: Jan 30, 2018, 07:02 PM IST
బాబోయ్.. లుంగీ ధర ఆరువేలా?

ఇండియాలో ఎక్కడైనా సాధారణంగా లుంగీ ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ.90..ఒకవేళ నాణ్యత గల లుంగీ కావాలంటే వందల్లో ఉంటుంది. కానీ.. స్పెయిన్ ఆధారిత ప్రముఖ లగ్జరీ దుస్తుల కంపెనీ 'జరా' తమ బ్రాండ్ పేరుతో భారత్ మార్కెట్లో ఒక లగ్జరీ లుంగీని ప్రవేశపెట్టింది. దీని ధర తెలిసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. 

ఇంతకీ ఆ లుంగీ ధర ఎంతో తెలుసా? రూ.4,990/- ఇది కనీస ధర మాత్రమే. గరిష్ట ఇంకెన్ని వేలల్లో ఉంటుందో మీకీపాటికే అర్థమై ఉంటుంది. మహిళల కోసం నిర్దేశించిన జరా లుంగీ స్కర్ట్ ధరను రూ. 6, 200గా పేర్కొన్నారు. కాగా ఇండియాలో తక్కువ ధరకే లభించే లుంగీలు ఉండగా.. అంత డబ్బు పెట్టి జరా లుంగీలను కొంటారా?లేదా? అన్నది వేచి చూడాల్సిందే..!!