గర్ల్‌ఫ్రెండ్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విజయ్ మాల్యా?

లిక్కర్ వ్యాపారి విజయ్‌ మాల్యా మూడోసారి పెళ్లి చేసుకోనున్నారు.

Updated: Apr 1, 2018, 04:31 PM IST
గర్ల్‌ఫ్రెండ్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విజయ్ మాల్యా?

లిక్కర్ వ్యాపారి విజయ్‌ మాల్యా మూడోసారి పెళ్లి చేసుకోనున్నారు. గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న పింకీ లాల్వానీ అనే సుందరిని ఆయన వివాహం చేసుకోనున్నట్లు తెలిసింది. భారత్‌లో బ్యాంకులకు 9000 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి లండన్‌లో ఉంటున్న ఈ మాజీ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత.. పింకీతో పెళ్లికి అన్ని వైపులా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో వివాహానికి సిద్దమైనట్లు సమాచారం. 2011లో పింకీ ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగానికి వచ్చింది. అప్పడే ఆమెను చూసి మనసు పారేసుకున్నాడట మాల్యా. అప్పటి నుంచే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్. సింధీ కుటుంబానికి చెందిన పింకీ వయసు 27 ఏళ్లు కాగా.. మాల్యా వయస్సు 62 సంవత్సరాలు.

 

మల్యాకి ఇప్పటికే రెండుసార్లు వివాహం జరిగింది. తొలిభార్య సమీరా త్యాబ్జీ కూడా ఎయిర్‌హోస్టెసే. ఆమెతో కేవలం ఏడాది మాత్రమే (1986-87) ఆయన కలిసి ఉన్నారు. అనంతరం చిన్ననాటి స్నేహితురాలు రేఖను వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ చట్టబద్ధంగా ఆమే ఆయన భార్య. ఈమెకు విడాకులివ్వకుండానే మాల్యా మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయనకు ముగ్గురు పిల్లలు.. కొడుకు సిద్ధార్థ్‌, కూతుళ్లు- లీనా, తాన్యా.