టాప్ 50 గ్లోబల్ థింకర్స్ జాబితాలో కమల

ప్ర‌ముఖ మేగ‌జైన్ ఫారిన్ పాల‌సీ టాప్ 50 గ్లోబ‌ల్ థింక‌ర్స్ జాబితాను విడుద‌ల చేసింది. 

Updated: Dec 5, 2017, 02:15 PM IST
టాప్ 50 గ్లోబల్ థింకర్స్ జాబితాలో కమల

కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన కమలా హారీస్ అదురైన ఘనత సాధించారు.  ప్రముఖ మేగ‌జైన్‌  ఫారిన్ పాలసీ విడుదల చేసిన గ్లోబల్ థింకర్స్ జాబితాలో ఆమె టాప్ 50లో స్థానం సాధించారు. ప్రతి ఏటా టాప్ 50 గ్లోబ‌ల్ థింక‌ర్స్ జాబితాను విడుద‌ల చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో కమలా హారీస్ స్థానంకు కల్పించారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కూడా డెమెక్రటిక్ పార్టీకి ఉనికి కాపాడుతూ ఊతంగా నిలుస్తోంద‌ని మేగ‌జైన్ ఆమెను వ‌ర్ణించింది. ఇంకా ఈ జాబితాలో మరో ఇద్దరు భార‌త అమెరిక‌న్లు... సౌత్ క‌రోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, క‌మెడియ‌న్ హ‌స‌న్ మిన్హాజ్‌లు కూడా స్థానం సంపాదించారు. 

ప్రస్తుతం కమలా హారీస్ కాలిఫోర్నియా సెనేట‌ర్ గా ఉన్నారు. భార‌త త‌ల్లికి, జ‌మైక‌న్ తండ్రికి జ‌న్మించిన క‌మ‌లా హారీస్.. యూఎస్ సెనేట్‌లో అడుగుపెట్టిన మొద‌టి భార‌త అమెరిక‌న్‌. అంతేకాదు సెనేట్‌లో ఏకైక నల్లజాతి మ‌హిళ కూడా ఈమే.