ఎన్నారైలను కరుణించని బడ్జెట్ 2018

భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టిన బడ్జెట్ 2018 ప్రవాస భారతీయులకు చేసిన మేలంటూ ఏమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated: Feb 2, 2018, 06:29 PM IST
ఎన్నారైలను కరుణించని బడ్జెట్ 2018
Source: DNA/Arun Jaitley - Gajanan Nirphale

భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టిన బడ్జెట్ 2018 ప్రవాస భారతీయులకు చేసిన మేలంటూ ఏమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశాల నుండి తీసుకొని వచ్చే బంగారు నగలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా పురుషులకు కనీసం 50 గ్రాముల వరకు, అలాగే మహిళలకు కనీసం 100 గ్రాముల వరకు బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ బడ్జెట్‌లో ఇలాంటి విషయంపై కేంద్రం ఏమీ స్పందించలేదు. అలాగే ఎన్నారైలు భారతదేశంలో ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరిపితే 12 శాతం జీఎస్‌టీ చెల్లించాలని కూడా గతంలో ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ జీఎస్‌టీని 5 శాతం తగ్గించాలని అనేక ప్రవాస భారతీయ సంఘాలు కోరాయి. దీనిపై కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఏమీ స్పందించలేదు. అలాగే ఎన్నారైలు భారతదేశంలో పలు పెన్షన్ ప్లాన్లు కల్పించాలని కోరారు. దానిపై కూడా ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు తీసుకురాలేదు. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close