ప్రపంచ దేశాల్లో రోడ్డెక్కిన ఆంధ్రులు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం కేవలం ఏపీలో, ఢిల్లీలోనే కాదు.. దేశ విదేశాల్లో వున్న ఆంధ్రులు ఆందోళన బాటపట్టారు. 

Updated: Mar 6, 2018, 07:56 PM IST
ప్రపంచ దేశాల్లో రోడ్డెక్కిన ఆంధ్రులు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం కేవలం ఏపీలో, ఢిల్లీలోనే కాదు.. దేశ విదేశాల్లో వున్న ఆంధ్రులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ దేశ విదేశాల్లో వుంటున్న ఎన్నారైలు తమ నిరసన తెలియజేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు పెద్ద పెద్ద పట్టణాల్లో వున్న తెలుగు వారు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు వారు అధికంగా వున్న ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ లోనూ ప్రత్యేక హోదా కోసం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న ఎన్నారైలు తమ సమీప ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్నట్టు సమాచారం.

 

ఈ నిరసనల్లో పాల్గొన్న ఆంధ్రులు మాట్లాడుతూ.. తాము వున్నది విదేశాల్లోనే అయినా.. తాము పుట్టిన గడ్డకు అన్యాయం జరుగుతుండటం చూసి తట్టుకోలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని ఈ సందర్భంగా ఎన్నారైలు డిమాండ్ చేశారు.