జాదవ్ తల్లికి, భార్యకు పాక్ వీసాలు మంజూరు

పాకిస్థాన్ కారాగారంలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి, భార్యకు పాకిస్థాన్ వీసా ఇవ్వడంపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు.

Last Updated : Dec 9, 2017, 07:28 PM IST
జాదవ్ తల్లికి, భార్యకు పాక్ వీసాలు మంజూరు

ఢిల్లీ: పాకిస్థాన్ కారాగారంలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి, భార్యకు పాకిస్థాన్ వీసా ఇవ్వడంపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.

'పాకిస్థాన్ ప్రభుత్వం కూల్ భూషణ్ జాదవ్ తల్లికి, భార్యకు వీసా మంజూరు చేసింది. నేను జాదవ్ తల్లి అవంతిక జాదవ్‌తో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పాను. ఇదివరకు పాక్ జాదవ్ భార్యకు మాత్రమే వీసా మంజూరు చేస్తామని అంగీకరించింది. జాదవ్ తల్లికి కూడా వీసా ఇవ్వాలని మేము అడిగాం. అందుకు పాకిస్థాన్ ఒప్పుకుంది.' 

 

'పాకిస్థాన్‌లో పర్యటించేటప్పుడు వారిద్దరి వెంట భారత రాయబార కార్యాలయానికి చెందిన ఒక అధికారిని వెంట ఉంచాలని మేము అడిగాం. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకుంది. వారి రక్షణ, భద్రత, స్వేచ్ఛకు ఎటువంటి భంగం వాటిల్లబోమని తెలిపారు' అని సుష్మా పేర్కొన్నారు. డిసెంబర్ 25న జాదవ్ తల్లి, భార్య ఇద్దరూ పాకిస్థాన్‌కు పయనమవుతున్నారు. 

Trending News