అమెరికాలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది.

Updated: May 14, 2018, 02:55 PM IST
అమెరికాలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి అమెరికాలో మరణించాడు. డల్లాస్‌లోని గ్లోబల్ ఐటీ కంపెనీలో వెంకట్రామిరెడ్డి పనిచేస్తున్నారు. ఈయన వయసు 40 సంవత్సరాలు. ఈయన భార్య కూడా ఉద్యోగినే.

స్నేహితులతో కలిసి నదిలో బోటు షికారుకెళ్లిన వెంకట్రామిరెడ్డి నీటిలో మునిగి చనిపోయాడు. ఆయనతో పాటు స్నేహితుల మృతదేహాలను డల్లాస్ పోలీసులు బయటకు తీసి దర్యాప్తును ప్రారంభించారు. ఇది రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. వెంకట్రామిరెడ్డి మృతదేహం వారం రోజుల్లో స్వగ్రామం అరెపల్లికి చేరనుంది.