రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై జోకులే జోకులు!!

Updated: Dec 31, 2017, 07:03 PM IST
రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై జోకులే జోకులు!!

రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టుగా అలా ప్రకటించారో లేదో అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల జోకులు, సెటైర్లు ట్రెండ్ అవడం మొదలుపెట్టాయి. అందులో కొంతమంది రజనీకాంత్ సామర్థ్యాలని ప్రశంసిస్తే, ఇంకొంతమంది అతడి వ్యక్తిత్వంపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్టులు పెట్టడం ప్రారంభించారు. 

తమిళనాడులో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కారణంగా జాతీయ స్థాయిలో వున్న రాజకీయ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారని ఇండైరెక్ట్ సెటైర్స్ వేశారు కొంతమంది నెటిజెన్స్. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇంకొన్ని ట్వీట్స్ ఇలా వున్నాయి.