ఫరాకి సానియా జన్మదిన శుభాకాంక్షలు

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌కి తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated: Jan 9, 2018, 09:12 PM IST
ఫరాకి సానియా జన్మదిన శుభాకాంక్షలు
Image Credit : Facebook

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌కి తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెకు ట్యాగ్ చేస్తూ వారిద్దరూ గతంలో తీసుకున్న ఫోటోని కూడా పోస్టు చేశారు. గతంలో ఫరాఖాన్ తాను సానియా మీర్జా బయోపిక్ తీసే అవకాశం ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు... ఫరా, సానియాకి మంచి స్నేహితురాలు కూడా. వీరిద్దరూ కలిసి గతంలో ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి దుబాయ్ కూడా వెళ్లారు. మే హూ నా చిత్రంతో ఫరా ఖాన్ దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఓం శాంతి ఓం, తీస్ మార్ ఖాన్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.అయితే సానియా బయోపిక్ ఎప్పుడు తీస్తారన్న విషయం మాత్రం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చెప్పలేదు.