ఇది "రామ్‌గోపాల్‌వర్మ" ఫాస్ట్ ఫుడ్ సెంటర్

చాలామంది తమకు నచ్చిన అభిమాన హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు షాపులకు పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఈయనెవరో రామ్‌గోపాల్‌వర్మకి వీరాభిమానిలా ఉన్నాడు. అందుకే తన అభిమానాన్ని ఇలా వ్యక్తం చేశాడు. తాను నడుపుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కి ఆర్జీవి పేరు పెట్టాడు. వెజ్ రోల్స్, చికెన్ చిల్లీ, కట్ లెట్స్ అమ్మే ఈ సెంటర్ విశాఖ‌పట్నంలోని సీతమ్మధార జంక్షనులో ఉందట. ఎవరో నెటిజన్లు ప్రస్తుతం ఈ సెంటర్‌ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీరు కూడా ఆర్జీవికి ఇలాంటి వీరాభిమానులు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారా.. అందులో వింతేముంది. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే వారి క్రియేటివిటీని మాత్రం అభినందించాల్సిందే.. 

 

 

Section: 
English Title: 
Vizag people started a restaurant in the name of Ramgopalvarma
News Source: 
Home Title: 

ఇది "రామ్‌గోపాల్‌వర్మ" ఫాస్ట్ ఫుడ్ సెంటర్

ఇది "రామ్‌గోపాల్‌వర్మ" ఫాస్ట్ ఫుడ్ సెంటర్
Caption: 
Image Credit: Facebook/Dileep
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes