ఈ వాట్సాప్ ఫీచర్ అడ్మిన్స్‌కు ప్రత్యేకం..!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

Updated: Jan 12, 2018, 06:14 PM IST
ఈ వాట్సాప్ ఫీచర్ అడ్మిన్స్‌కు ప్రత్యేకం..!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గ్రూప్ అడ్మిన్‌ను గ్రూప్ నుండి పూర్తిగా తొలిగించకుండా అడ్మిన్ బాధ్యతల నుండి మాత్రమే విముక్తి కలిగించే సరికొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌‌కి సంబంధించి ప్రస్తుతం ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది. ప్రస్తుతం వాట్సప్ టెక్నాలజీ ప్రకారం ఎంతమందైనా గ్రూప్ అడ్మిన్స్‌గా బాధ్యతలు తీసుకోవచ్చు.

అయితే ఒకవేళ ఎవరినైనా అడ్మిన్ బాధ్యతల నుండి తొలిగించాలంటే మాత్రం, వారిని గ్రూప్ నుండి పూర్తిగా తొలిగించి.. మళ్లీ చేర్చుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ పద్ధతికి స్వస్తి పలికి ఒక కొత్త డిస్మిస్ బటన్‌ను వాట్సాప్ ఫీచర్ రూపంలో తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ వస్తే అడ్మిన్‌ను గ్రూప్ నుండి తొలిగించకుండానే.. అడ్మిన్ బాధ్యతల నుండి తప్పించవచ్చు.

అలాగే వాట్సాప్ గ్రూప్ నిర్వహించే ప్రధాన అడ్మిన్‌‌కి కొన్ని అదనపు ఫీచర్స్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ ఫీచర్ గానీ అందుబాటులోకి వస్తే.. అడ్మిన్ సభ్యులు పోస్టు చేసే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల కంటెంట్‌ను కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది.