తొలి టీ20లో భారత్ విజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది.

Updated: Feb 14, 2018, 01:48 PM IST
తొలి టీ20లో భారత్ విజయం

పోట్చెఫ్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత జట్టు, దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విథాలీరాజ్ 54 (నాటౌట్; 48 బంతుల్లో 6ఫోర్లు , ఒక సిక్స్) పరుగులతో అజేయంగా నిలిచింది.

రోడ్రిక్స్ 37, వేద కృష్ణమూర్తి 37 పరుగులతో రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ వాన్ నీకెర్క్ 38, ట్రియన్ 32 (నాటౌట్), డు ప్రీజ్ 31 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్ రెండు వికెట్లు తీయగా, శిఖా పాండే, పూజా వస్త్రకార్ ఒక వికెట్ తీశారు.