కోచ్ తన కూతురినిచ్చి పెళ్లి చేస్తా అనేలా ఉండాలి: గిల్‌క్రిస్ట్

ఆస్ట్రేలియన్ లెజండరీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated: May 31, 2018, 03:37 PM IST
కోచ్ తన కూతురినిచ్చి పెళ్లి చేస్తా అనేలా ఉండాలి: గిల్‌క్రిస్ట్

ఆస్ట్రేలియన్ లెజండరీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ళందరూ ఎలా ఉండాలనే దానిపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ళందరూ ఎలా ఉండాలంటే.. కోచ్ తన కూతుళ్ళలో ఒకరిని ఇచ్చి పెళ్లి చేస్తా అనేలా ఉండాలని అన్నారు.  ఫాక్స్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గిల్‌క్రిస్ట్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

తమ కొత్త కోచ్ జస్టిన్ లాంగర్‌కు నలుగురు కూతుళ్లు ఉన్నారని, అతను ఇదే సెలక్షన్ ప్రక్రియలో ఉన్నాడని గిల్ క్రిస్ట్ చమత్కారంగా అన్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కోచ్‌గా వచ్చిన జస్టిన్ లాంగర్ ఆటగాళ్ల వ్యవహార తీరుపై చాలా కఠినంగా ఉంటున్న నేపథ్యంలో గిల్ క్రిస్ట్ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆటగాళ్లంతా ఎంతో క్రమశిక్షణగా ఉండాలని, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడూ కష్టపడి ఆడాలన్నదే లాంగర్ ఉద్దేశమని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో లాంగర్ ఆటగాళ్ళతో కాస్త కఠినంగా ఉంటున్నాడు. బాల్ టాంపరింగ్ ఘటన తరువాత కోచ్‌గా లీమన్ స్థానంలో లాంగర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.