బాలీవుడ్ తారలను వివాహం చేసుకున్న క్రికెటర్లు వీరే..!

డిసెంబర్ 11వ తేదీ టీమిండియా కెప్టెన్ విరాట్, బాలీవూడ్ నటి అనుష్క శర్మ ఇద్దరూ ఒక్కటయ్యారు.

Updated: Dec 12, 2017, 05:23 PM IST
బాలీవుడ్ తారలను వివాహం చేసుకున్న క్రికెటర్లు వీరే..!

డిసెంబర్ 11వ తేదీ టీమిండియా కెప్టెన్ విరాట్, బాలీవూడ్ నటి అనుష్క శర్మ ఇద్దరూ ఒక్కటయ్యారు. గత కొన్ని రోజుల నుండి వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియా, టీవీల్లో హల్ చల్ చేస్తుండగా.. వీరిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో చెక్ పడింది. ఇక ఇప్పుడు వీరిద్దరి మధ్య పెళ్లి ఊహాగానాలకు సంబంధించి ఎటువంటి వార్తలు రావు.

ఇకపోతే.. క్రికెట్ కు, బాలీవూడ్ కు మధ్య బంధం ఇప్పటిది కాదు. గతంలోనూ ఎంతోమంది బాలీవూడ్ నటీమణులతో మన టీమిండియా క్రికెటర్లు ప్రేమ వ్యవహారం నడిపారు. అయితే సక్సెస్ అయిన జోడీ మాత్రం కొందరే. ఏ క్రికెటర్ ఎవర్ని పెళ్లిచేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం.. !

* విడీస్ బ్యాట్స్ మెన్ వివియన్ రిచర్డ్స్.. నీనాగుప్తాను పెళ్లిచేసుకున్నాడు.

* మన్సూర్ అలీఖాన్  పటౌడీ .. షర్మిలా ఠాకూర్ ను పెళ్లిచేసుకున్నాడు.

* టీమిండియా ఆటగాడు హర్భజన్ సింగ్..  గీతా బస్రాను పెళ్లిచేసుకున్నాడు.

* జహీర్ ఖాన్.. సాగరిక ఘట్గే గత నెలలో పెళ్లిపీటలెక్కారు. 

* యువరాజ్ సింగ్.. హాజెల్ కీచ్ ను పెళ్లిచేసుకున్నాడు.

* పాకిస్థాన్ క్రికెటర్ మోసిన్ ఖాన్.. నటి రీనా రాయ్ ను వివాహం చేసుకున్నాడు.

* క్రికెటర్ అజారుద్దీన్.. సంగీతా బిజిలానీ తో నిఖా చేసుకున్నాడు.