ఆసియా కప్ 2018 : రవిశాస్త్రి స్థానంలో మెంటార్‌గా మారిన ధోని

యువ ఆటగాళ్లకు మెంటార్‌గా మారిన ధోని

Last Updated : Sep 18, 2018, 04:25 PM IST
ఆసియా కప్ 2018 : రవిశాస్త్రి స్థానంలో మెంటార్‌గా మారిన ధోని

నేడు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్, హాంగ్ కాంగ్ తలపడనుండగా అంతకన్నా ముందుగా జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని యువ ఆటగాళ్లకు ఆటలో మెలకువలు నేర్పుతూ ఓ మెంటార్ మారాడు. టీమిండియా కోచ్ రవిశాస్త్రితోపాటు పలువురు సిబ్బంది ఇవాళే దుబాయ్‌కి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆటగాళ్లు నిన్న, మొన్న నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో రవిశాస్త్రి అక్కడ లేకపోవడంతో, అంతర్జాతీయ స్థాయిలో ఆటపై అంతగా పట్టులేని యువ ఆటగాళ్లకు సందేహాలు తీర్చే బాధ్యతను ధోని తన భుజాలపై వేసుకున్నాడు. అవేష్ ఖాన్, ఎం ప్రసిధ్ కృష్ణ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, మయంక్ మర్కండె లాంటి యువ బౌలర్లు నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో బ్యాట్స్‌మేన్‌కి ఉపయోగపడుతుండగా అందరు యువ ఆటగాళ్లకు తర్ఫీదునిస్తూ వారి సందేహాలు తీర్చే కోచ్‌గా ధోని కనిపించాడు.

ఇండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టేన్‌గా మహేంద్ర సింగ్ ధోని అంటే ఆటగాళ్లు అందరికీ ప్రత్యేకమైన అభిమానమే. ప్రస్తుతం ఆసియా కప్‌కి నేతృత్వం వహిస్తున్న రోహిత్ శర్మకైనా, ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియాను ముందుండి నడిపిస్తున్న విరాట్ కోహ్లీకైనా ధోని అంటే అంతే ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Trending News