ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని స్వర్గీయ వాజ్‌పేయికి అంకితమిచ్చాడు

రెజ్లర్ భజరంగ్ పూనియా, ఆసియా క్రీడల్లో పురుషుల 65 కేజీల విభాగంలో తాను గెలుపొందిన బంగారు పతకాన్ని ఇటీవలే మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి అంకితమిచ్చారు. 

Last Updated : Aug 20, 2018, 12:41 PM IST
ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని స్వర్గీయ వాజ్‌పేయికి అంకితమిచ్చాడు

రెజ్లర్ భజరంగ్ పూనియా, ఆసియా క్రీడల్లో పురుషుల 65 కేజీల విభాగంలో తాను గెలుపొందిన బంగారు పతకాన్ని ఇటీవలే మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి అంకితమిచ్చారు. జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఫైనల్స్‌లో జపాన్ ఆటగాడు దైచి తకతానిని 11-8 స్కోరుతో ఓడించిన భజరంగ్, తన పతకాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయికి అంకితమిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సంవత్సరం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో చేరిన తొలి స్వర్ణ పతకం ఇదే కావడం విశేషం.

క్వార్టర్స్‌లో  తజకిస్థాన్‌కు చెందిన ఫైజీవ్‌ అబ్దుల్‌ ఖాసిమ్‌‌ను పూనియా 12-2 తేడాతో ఓడించగా.. సెమీస్‌లో మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లి భారత్‌కు మరో పతకం ఖాయం చేశాడు. పూనియా 2013 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు. అలాగే అదే సంవత్సరం నిర్వహించిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా కాంస్యం గెలుచుకున్నాడు. అలాగే కామన్వెల్త్ గేమ్స్ 2018లో పసిడి పతకం కూడా గెలుచుకున్నాడు పూనియా. 2015లో అర్జున్ అవార్డు కూడా పొందాడు పూనియా.

ఈ సారి ఆసియా క్రీడల్లో అన్ని విభాగాల్లో కలిసి దాదాపు 500 క్రీడాకారులను భారత్ పోటీలకు పంపించింది. ఈసారి రెజ్లింగ్‌లో పతకం తెస్తాడనుకున్న ఒలింపిక్ విజేత సుశీల్ కుమార్ నిరాశ పరిచాడు. అలాగే పురుషుల 97 కేజీ క్వార్టర్స్‌లో భారత క్రీడాకారుడు ఖత్రీ మౌసమ్‌ నిరాశ పరిచాడు. ఉజ్జెకిస్థాన్‌ క్రీడాకారుడు ఇబ్రాగి మాగోపై 0-8 తేడాతో పరాజయం పాలయ్యాడు.పురుషుల 86 కేజీల విభాగంలో కూడా భారత రెజ్లర్ పవన్‌కుమార్‌  0-11 తేడాతో ఇరాన్‌ ఆటగాడు హసన్‌పై ఓడిపోయాడు.

Trending News