ఫేసర్ మిచెల్ కు గాయాలు, ఐపీఎల్ నుంచి ఔట్

Updated: Mar 14, 2018, 08:09 AM IST
ఫేసర్ మిచెల్ కు గాయాలు, ఐపీఎల్ నుంచి ఔట్

ఆసీస్ స్పీడ్‌ స్టార్‌ మిచెల్‌ జాన్సన్‌  గాయాలపాలయ్యాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. జిమ్‌లో  చిన్‌-అప్‌ బార్‌ వ్యాయామం చేస్తుండగా అది జాన్సన్‌ తలకు బలంగా తగిలింది. మిచెల్‌ తలపై16 కుట్లు పడ్డినట్లు వైద్యులు పేర్కొన్నారు. 

ఐపీఎల్ లో ఆడేది డౌటే ..
మిచెల్ జాన్సన్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా ఖరీదు చేసిన సంగతి తెలిసిందే.  గాయం కారణంగా అతను ఐపీఎల్‌లో ఆడేది అనుమానంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ ఆటగాడి వేటలో పడింది కోల్ కతా నైట్ రైటర్స్ మేనేజ్‌మెంట్.