ఆసీస్ టూర్ లో అనుష్కకు అవమానం !!

 టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో కలిసి విరాట్ అనుష్క జోడి దిగిన ఫోటో పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటో..ఎందకు విమర్శలు.. చేస్తే ఎవరిపై చేస్తున్నారనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే

Last Updated : Jan 20, 2019, 06:35 PM IST
ఆసీస్ టూర్ లో అనుష్కకు అవమానం !!

ఆసీస్ ని వారి సొంత గడ్డపై ఓటమి పాలు చేసిన కోహ్లీ సేన సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ తర్వాత న్యూజిలాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులు ఆస్ట్రేలియాలో ఉంటూ క్రికెటర్లు షికార్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ అయితే తన భార్య అనుష్కతో కలిసి తిరుగుతూ సంతోషాన్ని పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న మెల్ బోర్న్ పార్క్ ను శనివారం కోహ్లీ అనష్క జంట సందర్శించింది. అ సందర్భంగా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో కలిసి వీరుష్క జోడి  ఫొటోలు కూడా దిగారు.

ఇక్కడే మొదలైంది అసలు చిక్కు..

టెన్నీస్ దిగ్గజం రోజుర్ ఫెదరల్ తో కోహ్లీ అనుష్క జంట కలిసి దిగిన ఓ ఫొటోను ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రోజర్ ఫెదరర్ మధ్యలో నిలబడగా ఒకవైపు  విరాట్..మరోవైపు అనుష్క నిలబడింది. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ ‘త్రీ లెజెండ్స్, వన్ ఫొటో’ అనే క్యాప్షన్ ని జోడించింది. ఈ క్యాప్షన్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

నెటిజన్ల కామెంట్స్ ఇవే..

* ఫెదరర్, కోహ్లీతో ఉన్నంత మాత్రాన అనుష్క ‘లెజెండ్’ అయిపోతుందా? 
* మూడో  లెజెండ్ ఎవరు ..బహుశ ఆమె ఫోటో పెట్టడం మరిచిపోయినట్లున్నారు !!
* లెజెండ్ గా ప్రకటించిన ట్వీట్ లో చిన్న లోపం జరిగింది..
* అనుష్కను లెజెండ్ గా పిలిచి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి

ఇలా రకాల రకాల విమర్శలు చేస్తూ అనుష్కను లెజెండ్ గా పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు బాలీవుడ్ లో అగ్రనటిగా పేరు తెచ్చుకున్న అనుష్కను లెజెండ్ అంటే తప్పేంటని మరి కొందరు దీనికి కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

Trending News