ఐపీఎల్-2018 సాంగ్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి

Updated: Mar 13, 2018, 09:28 PM IST
ఐపీఎల్-2018 సాంగ్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ కోసం సర్వం సిద్ధమైన వేళ దీనికి సంబంధించిన సాంగ్ రీలీజ్ చేసింది. బీసీసీఐతో కలిసి బ్రాడ్‌కాస్టర్ ‘స్టార్ ఇండియా’ విడుదల చేసిన ఈ సాంగ్ పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో  గత పది సీజన్లుగా ఐపీఎల్‌లో జరిగిన ముఖ్య సంఘటనలు మిక్స్ చేస్తూ దానికి ఓ పాటని జత చేసి ఈ గీతాన్ని విడుదల చేశారు. దీంతో పాటలో పాత సంఘటనలు తప్పితే కొత్తగా కనిపిచేంది ఏది లేదనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 

 

ఐపీఎల్ ను పెద్ద పండలా భావించే భారత్ అభిమానులు.. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత పదేళ్ల నాటి ఘటనలు నింపడం తప్పితే కొత్తగా ఏమీ లేకపోవడం తప్పే కదా మరి.. కొత్తదనాన్ని కోరుకునే అభిమానులకు సరికొత్తగా చూపించాల్సిన బాధ్యత ఐపీఎల్ నిర్వహికులపై ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.