బాలీవుడ్ భామ నిధి అగర్వాల్‌తో క్రికెటర్ కేఎల్ రాహుల్ లవ్ అఫైర్

   

Last Updated : May 30, 2018, 07:29 PM IST
బాలీవుడ్ భామ నిధి అగర్వాల్‌తో క్రికెటర్ కేఎల్ రాహుల్ లవ్ అఫైర్

ముంబై: క్రికెటర్లతో బాలీవుడ్ తారల లవ్ అఫైర్స్ సర్వ సాధారణంగా మారిన తరుణంలో మరో కొత్త జంట పేరు తెరపైకి వచ్చింది. ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న కోహ్లీ - అనుష్క గత ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు.. ఇప్పుడు తాజాగా మరో జంట పేరు బయటికి వచ్చింది. ఇంతకీ వారిద్దరూ ఎవరు అంటే టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌.. బాలీవుడ్‌ తార నిధి అగర్వాల్. వీరిద్దరూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో హల్ చల్ చేస్తున్నట్లు కనిపించారట. వీరిద్దరు కలిసి తిరిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఇరువురు ఇప్పటి వరకు నోరుమొదపలేదు. మీడియా ప్రతినిధులు తారసపడి అడిగితే నో కామెంట్స్ అంటూ సమాధానం దాటవేస్తున్నారు. వీరిద్దరి ప్రేమాప్రయాణం పెళ్లి వరకు వెళ్తుందో.. లేదో చూడాల్సిందే.

Trending News