భారత్ దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిలా..!

సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. 

Updated: Feb 4, 2018, 07:15 PM IST
భారత్ దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిలా..!

సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలను చాహల్ (5/22), కుల్ దీప్ (3/20) దెబ్బతీయగా.. దక్షిణాఫ్రికా బాట్స్‌మన్ విలవిల్లాడారు. కేవలం 32.2 ఓవర్లో 118 పరుగులకే అవుటయ్యారు. తర్వాతి బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెటర్లలో శిఖర్ ధావన్ (56), కోహ్లీ (46) అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విచిత్రమేంటంటే.. సఫారీ జట్టును తమ హోంల్యాండ్ లోనే మొదటిసారి చాలా తక్కువ స్కోరు 118కి ఆలౌట్‌ చేశారు భారత బౌలర్లు. అలాగే చాహల్ కూడా తన కెరీర్‌లోనే తొలిసారిగా ఐదు వికెట్లు తీసి భారత్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే సఫారీలపై ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా కూడా రికార్డులకెక్కాడు.