4వ వన్డేలో ధావన్, కోహ్లీ 50-50 !

విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ చెరో 50-50తో చెలరేగిపోయారు.

Updated: Feb 10, 2018, 06:51 PM IST
4వ వన్డేలో ధావన్, కోహ్లీ 50-50 !

ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ చెరో 50-50తో చెలరేగిపోయారు. 19వ ఓవర్‌లో ఎబ్లీడబ్లూ కాబోయి లక్కీగా తప్పించుకున్న ధావన్ ఆ తర్వాత మరో రెండు బంతులకే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఖాతాలో 26వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 27 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి శిఖర్ ధావన్ 78 బంతుల్లో 86 పరుగులు పూర్తి చేసి అదే వేగంతో సంచరీవైపు దూసుకెళ్తున్నాడు. 

CLICK HERE FOR LIVE SCORE UPDATES

ఇక టీమిండియా కెప్టేన్ విషయానికొస్తే, 21 ఓవర్లో మోర్కెల్ విసిరిన 2వ బంతిని బౌండరీకి తరలించడంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ తన వ్యక్తిగత ఖాతాలో 46వ అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 27 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి విరాట్ కోహ్లీ 71 బంతుల్లో 68 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ఇలాగే కొనసాగితే, సఫారీలకు భారీ స్కోర్ లక్ష్యంగా విధించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.