ఆ క్రికెటర్‌‌కి ఐపీఎల్ కన్నా.. పెళ్లే ముఖ్యం

ఎవరైనా క్రికెటర్లు ఐపీఎల్ ఎందుకు ఆడతారు.. డబ్బులు వెనకేసుకోవడానికే కదా. 

Updated: Feb 9, 2018, 06:05 PM IST
ఆ క్రికెటర్‌‌కి ఐపీఎల్ కన్నా.. పెళ్లే ముఖ్యం

ఎవరైనా క్రికెటర్లు ఐపీఎల్ ఎందుకు ఆడతారు.. డబ్బులు వెనకేసుకోవడానికే కదా. కానీ ఆస్ట్రేలియా బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్ మాత్రం తనకు ఐపీఎల్ కన్నా.. వివాహమే ముఖ్యమని అంటున్నాడు. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌, పుణె వారియర్స్‌ తరఫున బరిలోకి దిగిన ఈ ఆటగాడు ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టులో స్థానంలో కోసం కొంత సమయం వెచ్చించనున్నాడు. అందుకోసం షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో ఆడడానికి సంసిద్ధుడు అవుతున్నాడు. అలా తాను ఒక ప్లానింగ్ ప్రకారం అన్నీ చేస్తు్న్నానని.. తన లైఫ్, కెరీర్ అన్నీ తన ప్లానింగ్ ప్రకారం జరుగుతాయని ఆయన అన్నాడు.

ఒకవేళ తాను ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడడానికి పేరు ఇస్తే.. తన ప్రణాళిక మొత్తం మార్చాల్సి వస్తుందని.. అది తనకు ఇష్టం లేదని ఆయన అన్నాడు. వీలైతే వచ్చే సంవత్సరం ఐపీఎల్ ఆడతానని.. ప్రస్తుతానికి పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నాడు.