నిదహాస్ ముక్కోణపు సిరీస్: వర్షం కారణంగా టాస్ ఆలస్యం

కొలంబోలో కురుస్తున్న తేలికపాటి జల్లుల కారణంగా భారత్ vs శ్రీలంక మ్యాచ్‌పై కమ్ముకున్న నీలినీడలు

Updated: Mar 12, 2018, 08:35 PM IST
నిదహాస్ ముక్కోణపు సిరీస్: వర్షం కారణంగా టాస్ ఆలస్యం
BCCI

శ్రీలంకలో జరుగుతున్న నిదహాస్ టీ20ఇంటర్నేషనల్ ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్నాడు. అంతకన్నా ముందుగా వర్షం కారణంగా టాస్ వేయడానికి ఆలస్యమైంది. కొలంబోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తేలికపాటి జల్లులు కురుస్తుండటంతో సాయంత్రం నుంచే మైదానంపై కవర్స్ కప్పి పెట్టి మైదానం తడవకుండా జాగ్రత్తపడ్డారు అక్కడి స్టేడియం నిర్వాహకులు.

 

వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యం కావడంతో 20 ఓవర్ల మ్యాచ్‌ని 19 ఓవర్లకు కుదించినట్టు బీసీసీఐ స్పష్టంచేసింది.